అవు మల్ల. బంగారం కత్తని మెడ కోసుకోం గద! గట్లనే బంగారాన్ని ఏమన్న తింటమా? మా అయితే ఒంటిమీదేసుకుని సంబురపడతం. కనీ నిజంగనే బంగారాన్ని తింటే ఎట్లుంటది!? ఇగో గీ ఆలోశెనె గవాల్లను గీ బంగారం మిఠాయిని తయారు జేశేటట్లు చేసిందట. సాయి సందేశ్ తేజ అందించే ట్రెండ్స్

ఒల్లంతా బంగారం ఏసుకోవడం సూసినం. ఇల్లంతా బంగారం సూసినం. ఇగ గిది ఒంటి లోపలంతా బంగారమే! అరె గదెట్ల!?
అవు మల్ల. బంగారం కత్తని మెడ కోసుకోం గద! గట్లనే బంగారాన్ని ఏమన్న తింటమా? మా అయితే ఒంటిమీదేసుకుని సంబురపడతం. కనీ నిజంగనే బంగారాన్ని తింటే ఎట్లుంటది!? ఇగో గీ ఆలోశెనె గవాల్లను గీ బంగారం మిఠాయిని తయారు జేశేటట్లు చేసిందట.
ఇగో మన దేశంల జైపూర్ ఉందిగద. గా జైపూర్ ల బంగారం అసొంటి మిఠాయిని తినిపించే ఓ మిఠాయి దుకాణపాయనకు, ఓ బంగారమసొంటి ఆలోశెన వచ్చింది. తన దుకాణానికి వచ్చేటోల్లకు బంగారాన్నే తినిపిస్తే!? అనుకున్నడు. ఇగ మనిషి తినగలిగేంత, మనిషి శెత్తల కరిగేంత భస్మం… గదేనుల్ల, బూడిదయ్యేంత 24 క్యారెట్ల బంగారం కలిపి, మిఠాయి తయారు జేస్తాండ్లు! గిదీంట్ల ఆఫ్గానిస్తాన్ ల పండే పిరమైన ఎండిన చిల్గోజ ను కలుపుతరట. కుంకమ పువ్వు, పైన్ పలుకుల పొడిని పైన సల్తరట. ఇగ గదానికి బంగారం మిఠాయి అని పేరు బెట్టిండ్లు.. గా మిఠాయి దుకాణం నడిపే అంజలిజైన్. ఇగ గీ బంగారం మిఠాయికి లోకి 1 లచ్చా 11యేలు ధర పెట్టిండ్లు. ఎట్లుంది? అసలే బంగారం మిఠాయి ఆయె, తినంది తెలుస్తాది? మీరు గూడ రుసి సూడుండ్లి. గిప్పుడే గింత పిరమైంది! గనీ, గీ బంగారం తినడం మొదలు పెడితే, గీ పపంచకంల బంగారం దొరుకుతదానుల్లా!? గదేమన్న పండించేదా!?

