
యే తియ్! లచ్చలు పెట్టినా, ఎంత మంచిగ కట్టినా, ఇల్లు అన్నాక… అయితే కురుసుడో లేకపోతే కారుడో ఏదో ఒకటి ఉంటనే ఉంటది. ఇగ గట్టిగ ఆనలు పడితే అంతే సంగతులు. ఇగ గిసొంటి సమస్య లేకుండ, ఓ మేస్త్రీ గీ ఇకమతు కని పెట్టిండు.
గదేందంటే, గోడ అంచులకు సిమిటిల గింతంత సున్నం కలిపి క్యాపుల్లెక్క అంటు పెట్టిండు. ఇగ గవి ఎండినంక మంచిగ ముత్యాల్లెక్క కనబడ్తానయి. గవాటికి ఏరేరు రంగు యేసుకుంటే ఇంకా మంచిగ తీరొక్క డిజన్ లెక్క కనబడ్తయి. గట్టిగ ఆనల పడ్డప్పుడు గవాటి ఎంట నీల్లు కారిపోతయి. ఇల్లు కురువకుంట ఉంటది. సూత్తె మంచిగ ఉంటది. ఎట్లున్నది? మంచిగున్నది గదా?

