గీ దినాలల్ల.. మనిషికోరోగం మామూలైంది. ఇగ మోకాళ్ళ నొప్పులకైతే లెక్కే లేదు. కీళ్ల వాతం పెరిగిపోతాంది. అడుగు తీసి అడుగు పెట్టుడు లేదాయె. సుకాశి పానాలైనయి. ఇగ గీ జనం పెరుగుట్ల, జాగ తక్కువైతాంది. ఇగ ఇంటి మీద ఇల్లు కట్టుడెక్కువైంది. కొందరైతే లిఫ్టులు పెట్టుకుంటాండ్లు. గది అందిరికి సులువయ్యే పనా? కాదు గద. గందుకే ఒకాయన మొకాళ్ళ నొప్పులున్నోల్ల కోసం గీ మెట్ల ఇకమతు కనిపెట్టిండు.
ఎప్పటి లెక్కనే కట్టే మెట్లను కట్టిండు. గండ్ల ఎడమకెల్లి సగం సగం శెక్కిండు. ఇగ గి వీట్ని ఎక్కుడు అలకన అన్నట్లు. తక్కువ ఎత్తుంటయి. కాలు ఎత్తి మెట్లు అల్కగ ఎక్కొచ్చు. గివీట్నే క్రాస్ మెట్లన్నరు. గీ ఇకమతు మంచిగున్నద కద!?

