
కోతి శేష్టలంటరు. అంటే గా కోతి శేష్టలు బాగుండయన్నట్టు. ఇల్లు పీకి పందిరేసినట్లు… లంకను దహనం చేసినట్లుంటయి. అయితే గట్లాంటి కోతులు గూడ మంచి మంచి పనులు జేస్తే ఎట్లుంటది? గీ ఆలోసన ఒగాయనకు వచ్చింది. ఏం జేసిండో చూడుండ్లి.
ఓ కోతి ఓ బంతి పూల దండను సేతుల పట్టుకుంది. మెల్లంగ గా ఆంజనేయుడి యిగ్రహం కాడికి పోయింది. తన సేతుల దండను గా యిగ్రహానికి యేసింది. ఇగ ఐటెంక, గక్కడ్నే నిల్సుండి, గా ఆంజనేయుడికి రెండు శేతులు జోడించి మొక్కింది. గింతే, గది సూసినోళ్లు అబ్బ గీ కోతి ఎంత బుద్ధిమంతురాలు? అనుకున్నరు. గని గది గీ మద్దెల వచ్చిన ఏఐ గదేనుల్ల ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ అంటాండ్లు గద. గదాన్ని వాడుకుని ఒకాయిన గీ యీడియో తయారు జేసిండట. గది తెల్సినంక ఓర్నీ నీ క్రియేటివిటీకి దండం పెడుదు. ఇంక రాను రాను గిసుంటియి ఇంకెన్ని సూడాల్నోనని ఇచ్చెంత్రంగ ముక్కు మీద యేలేసుకుంటాండ్లంట!

