
ఏ పనైనా ఎట్ల జేస్తం? కట్టం తక్కువుండాలె. ఫలితం ఎక్కువుండాలె. ఉపాయంతో జేయాలె. ఇగ గిదీన్నే గిప్పుడు స్మార్ట్ వర్కంటాండ్లు. గీ ఇసుకని గూడ గింత సెమట సుక్క దీయకుండ, పైనించి, కిందికి దించుతాండొకాయన. గిది జూసినోల్లు నీ ఇకమంతు సల్లగుండ! ఎంత మంచిగున్నది? అనుకుంటాండ్లు.
ఇగ గీ మద్దెల ఎవలు ఇల్లు గట్టిన గూడ మిద్దె మీద మిద్దె కడతాండ్లు. గా మిద్దెల మీద ఎక్కువైన ఇసుకను దించాలంటే మనుషుల్ని బెట్టాలె. పైసలియ్యాలె. గిదంతా లేకుండా, గవన్నీ మిగిలేటట్లు ఒకాయనె ఇకమతు జేసిండు. మన ఆడోల్లు కట్టిడిసిన శీరెలుంటయి గద. గదాంట్లెకెల్లి ఒకదాన్ని తీసుకున్నడు. గదాన్ని పైనుంచి కిందికి జారిడిసిండు. పై నుంచి గదాంట్లె ఇసుకను పోసిండు. గది సక్కగొచ్చి ఒక్కదగ్గరికి చేసి కుప్పపోసినట్లు పడ్డది. మంచిగున్నది గదా గీ ఇకమతు!

