
ఇగ గీ రోజుల్ల ఏముంది? పొయ్యి మీద గిన్నె బెట్టి, ఫోన్లు, టీవీలు జూసుకుంటనే ఉండబట్టిరి. ఇగ గా గిన్నెల పాలు, కూరలు, బువ్వలు మాడిమసైపోబట్టె. గా మసిని పోగొట్టాలంటే ఇగ తోముడే తోముడు. రాకినా, గీకినా గది పోదు. మన ఆడోల్ల చేయిలన్ని పోతాంటయి. మనోల్ల కట్టాలు సూడలేక, గిదీనికి పెద్ద కర్సులేని శిట్కా ఒకటి కనిపెట్టిండ్లు. గదేందంటే…
మనం పెయికి రుద్దుకునే సబ్బుంటది గద. గదేనుల్ల పెయ్యి సబ్బును సిన్నగా కొబ్బరి పొడి లెక్క గీక్కోవాలె. గండ్ల గింతంత శెక్కర యేసి, గింత తమ్సప్ పోసి కలుపుకోవాలె. గదాన్ని ఒక డబ్బల నిలువ పెట్టుకోవాలె. నీసు కూరలు, నూనెల్లనే ఉడికిచ్చే ఫ్రైలు ఒండినప్పుడు, లేకుంటే ఎంత తోమినా మసిపోని గిన్నెలు, మూకుడ్లను గదాంతోటి రాసి తోమితే అయిపాయె. గంతే గా మూకుడు తెల్ల తెల్లగా మెరిసిపోతది. గీ శిట్కాను మీ ఇంట్ల గూడా ఓ పాలి ట్రై చేయండి.

