
ఏ శెట్లకైనా.. పువ్వులు పూసి, పిందలేసి, కాయలుగాసి, పండ్లైతయి. గవాట్ని మనం తెంపుకొని కమ్మగ తింటం. కాయలు గాసే వరకైతే సరే గనీ, ఇగ గిప్పుడు గా కాయలు పండ్లయ్యేదాక తినే ఉబ్బు ఆగేటట్లు లేదు. గా కాయల్నే జప్పజప్ప నిమిషాలల్లనే పండబెడ్తాండ్లు. అమ్ముతాండ్లు. గవాటినే మనం తింటానం. రోగాలు తెచ్చుకుంటానం.
ఇగో గిప్పటి దాకా గా మామిడి పండ్లను, అరటి పండ్లను కాల్షియం కార్బైడ్ మందేసి పండిచ్చుడే చూసినం. ఇగ గిప్పుడైతే, ఇంకో కొత్తరకంగా పండిస్తాండ్లు. గదెట్లంటే, అరటి శెట్టుకు గెలను తెంపుడే ఆలశెం. గా గెలను తీస్కపోయి, ఓ బకెట్ల కెమికల్ కలిపిన నీటిలో ముంచుతరు. ఐదారు నిమిషాల తర్వాత ఇగ బయటికి తీస్తిమా? గవి పసుపు పచ్చగ నిగనిగలాడుతూ కనిపిస్తయి. గవాట్ని తెచ్చి అమ్ముతాండ్లు. ఇగ మనం ఎంత నిగనిగలాడితే గంతమంచియని తెచ్చుకుని తెగ తింటానం. రోగాల బారిన పడుతానం. అంటే రోగాలను కొని తెచ్చుకుంటున్నమన్నమాట! పండ్లు తింటోల్లు జెర పైలం!?

