
రాయి, సలాక, ఇసుక, ఇటుక, సిమిటి, సెమట కలిస్తేనే ఇల్లు. ఇగ ఇట్క లేకుండ గా గోడలైతాయి. కావు గద? మరి గా ఇట్కల్ని తీస్కపోవడాన్కి ఓ మంచి కిట్కు కనిపెట్టోండో మేస్త్రన్న.
ఏం లేదుల్లా! ఓ సలాక తీస్కున్నడు. ముక్కల్జేసిండు. గవాట్ని గొల్లెంలెక్క అత్కిండు. ఓ సలాకకు కొసకు గింత గంటె లెక్క జేసిండు. గా సలాక అత్కుట్లనే ఓ సలాకను పట్కునేటట్లు జేసిండు. ఇగ వర్సగ 4 ఇట్కల్ని పక్కపక్కన పెట్టిండు. గా సలాకలతోని జేసిన దాన్ని గ ఇట్కల మీద పెట్టిండు. పైకి లేపిండు. ఇగ గా ఇట్కలన్నీ ఒక్క ముద్ద లెక్క పైకి లేసినయి. గదాన్ని సూట్కేసు లెక్క, పట్టుకుని పోతాండు. ఇగ ఎట్లుందో సూడుండ్లి గా మేస్త్రన్న తెలివి!

