ఉల్లి జేసే మేలు తల్లిగూడ సేయదంటరు. గనీ, గా ఉల్లిగడ్డ కొసేటప్పుడు బాగా ఏడ్పిత్తది. కల్లు మండుతయి. ముక్కులదురుతయి. కల్లకు నీల్లు రాకుండా ఉల్లిగడ్డ ఎవలైనా కోత్తరా చెప్పుండ్లి. కోస్తే ఎంత ప్రైజైనా ఇయ్యొచ్చు గదా. గిదంత కాదు గనీ, గా ఉల్లిగడ్డను గూడ గింత గూడ ఘాటు రాకుండ, కంటికి నీరు రాకుండా కోయొచ్చట. గీ కిటుకుని ఒకామె కనిపెట్టింది.
ఏం లేదుల్లా… గా ఉల్లిగడ్డను కోసే కత్తికి గింతంత మంచినూనె రాయాలె. ఐటెంక గా కత్తితోని ఉల్లిగడ్డలను కోయాలె. గంతె. కంటికి నీరొత్తే ఒట్టు. మంచిగున్నది గదా గీ కిటుకు. మీరు గూడ ఓపాలి షురువు జేయుండ్లి.

