ఇగో గీ ఆటోలకు డైబరుండడు. ఇగ మనం గా ఆటో ఎక్కి యేడికి పోవాల్నో సెప్తె సక్కగ గాడికే తీస్కపోతది. గదేంది? పట్నాలల్ల రద్దీ ఉంటది గదా? గదెట్ల తీస్కపోతది? మనమెట్ల పోతం? అనిగదా మీ అనుమానం? గట్లాంటియన్ని తీస గట్టున పెట్టుండ్లి. నే చెప్పేది మనుసు పెట్టుండ్లి.
మన దేశంల కరెంటుతో నడిశే 3 గిరకల బండ్ల తయారీ సంస్థ ఒమెగా సీకి మొబిలిటీ గీ సెల్ఫ్-డ్రైవింగ్ ఆటోలను తయారు చేస్తుందంట. ఒక్కసారి కరెంట్ పెడితే, 120 కిలో మీటర్లు పోతదట. గా 3 గిరకల మనుసులనెక్కిచ్క పోయే ఆటోకి 4 లచ్చలు, సరుకులను మోస్కపోయే ఆటోకి 4 లచ్చలకు కొంచెం ఎక్కువే అయితయట. గీ మద్య ఏఐ అని ఒకటొచ్చింది గదా? గదాంతోటే గది నడుస్తదట. అటానమీ సిస్టమ్, లైడార్, జీపీఎస్, సెన్సర్ల ని గదానికి పెట్టిండ్లట. ఇగ గది డైబర్ లేకుండనే ముందే మ్యాప్ సేసి రోడ్డు మీద పోతదట. ఎవలన్న అడ్డమొస్తె గదే ఆగుతది. గా అడ్డం తొల్గంగనే గదే మల్ల పోతది. మన రోడ్ల మీద బొందలు, బోకెలొస్తే గదాన్ని తప్పించుకుని గదే పోతది. అరె గిదోదే మంచిగుంది గద. ఇగ గివి రోడ్ల మీద్కి రావడాన్కి ఎక్కువ టైమేం పట్టదట. మనసులూ రడీగుండ్లుండి. డైబర్ లేని గా ఆటో ఎక్కేటందుకు?

