
మన ఇండ్లళ్ళ పోపు డబ్బాలుంటయి గద. గా డబ్బలల్ల మాల్ మసాలాలు నింపుతం. ఇగ గా డబ్బల శెంషె పెట్టాలంటే పట్టనే పట్టదు. వంకర టింకర జేసి గండ్లనే కుదిచ్చి కుదిచ్చి చూస్తం. కాస అటిటు అయిందంటే అందులన్న మాల్ మసాల నేలపాలైతది. ఇగ గీ పరేషాన్ కి గూడ ఓకాయన ఓ కిటుకు కనిపెట్టిండు.
గదేందంటే గా డబ్బల మాల్మమసాల నింపినంక, గా డబ్బా కొసకు ఓ దిక్కు గింతంత ప్లాస్టర్ అతుకుబెట్టాలె. గా ప్లాస్టర్ల కెల్లి శెంషెను పెట్టే సందు వదిలిపెట్టాలె. ఇగ గా శెంషెను గ గదాంట్ల శెక్కాలె. మూత పెట్టాలె. గంతె!

