
లోకంల దిమాక్ కు మించింది లేదు. సూపున్నోడు కనబడ్డకాడికే సూత్తడు. దిమాకున్నోడు పపంచమంతా సూత్తడు. అగ్గిపెట్టెల పట్టేంత సీర నేసినోల్లు, బియ్యంపు గింజ మీద పెద్దపెద్ద రాతలు రాసినోల్లు, ఎందరో ఉన్నరు. గివన్నీ మత్తుగ జూసినం గనీ, గిది ఇంకో లెవెల్ అన్నమాట.
ఓ తెలివికల్లోడు గది మామూలుగా సేయలే. ఓ ఖాళీ మందు సీసల మంచం పెట్టిండు. సీస ఎట్లున్నదో గట్లనే ఉన్నది. లోపలకి మంచం పోయింది. గీ ముచ్చట అందర్నీ అబ్బుర పరుస్తున్నది. గా సీస కోసి, సిన్నగ మంచం సేసి, గ దాంట్ల పెట్టిండు గంతే అనుకుంటున్నారా… ఏంది? గట్ల కాదుల్లా.. ఎట్లున్న సీసా గట్లనే ఉన్నది… దాన్ని కోయలే… ఏమిలే గని గండ్ల మంచం పెట్టిండు… గంతే ఇగ నెటిజన్లు గిది ఎట్లా పెట్టిండా? అని ఒకడు.. మనోళ్లకు మస్త్ కళలు ఉన్నయి అందులో ఇదొక్కటి అని ఇంకొకడు, గివీల్లను కాపాడుకోవాల్నెని మరొకడు కామెంట్లు పెడుతున్నరు. గీయన తెలివి మస్తుగున్నది గద?

