
ఇగో మనుసులకే గాదుల్లా… జంతువులకు గూడ గా పేమలు, గీ ఆలోసెనలుంటయి. గవాట్ని మనం పట్టంచుకోం గనీ, గవి గా టైమొచ్చినప్పుడే బయటపడ్తయి.
ఇగో గా సీలంకల మొన్న ఓ గమ్మత్తు జరిగింది. గా అడ్విల కెల్లి రైలు పోతాంది. గా రైలు నడిపెటాయనకు రైలు పట్టాలు దాటుతున్న ఏనుగులు కనిపించినయి. యెంటనే గా రైలును ఆపిండు. ఇగ గా రైలును సూసిన తల్లి ఏనుగు పట్టాలు దాటడాన్కి ముందుకు కదిలింది. గనీ, గా పిల్ల ఏనుగు అక్కడ అడుగు గూడ ముందుకేయలే. ఇగ గి దీన్ని సూసిన తల్లి ఏనుగు పిల్ల ఏనుగును తొందరగ దాటు అన్నట్లు… గా పిల్ల ఏనును ఎన్క నుండి ముందుకు నెట్టింది. ఇగ అన్నీ గలిసి గా పట్టాలను దాటినయి. అటెంక గా డ్రైవర్ రైలును పోనిచ్చిండు.
ఇగ గిదీన్ని గాడెవడో ఫోన్ల యీడియో దీసిండు. నెట్టింట్ల బెట్టిండు. ఇగ గదాన్ని సూసినోళ్లు మల్లొక్కలికి పంపుకుంటనే ఉండ్లు. నిజమే గదా? గా మనుసుల్లెక్క జంతువులు గూడ.

