ఇగ ఎవలన్న తిక్కతిక్కగ శేషినా, పొల్లగాండ్లు అల్లరి గిల్లరి శేసినా, ఏమంటం? యే ఇగ సాలు తియ్, గా కోతి శేష్టలు? అంటం గదా? మరి గా కోతి… కోతి శేష్టలు మాని బుద్ధిగ కూసుంటే ఏమంటం?
ఇగో గాడ ఆడ పిల్లలు మైదాకు పెట్టుకుంటాంటే, గా కోతి సూసింది. ఇగ మెల్లగా గ వాళ్ళ దగ్గరకు పోయి, రొండు శేతులు సాపింది. గవాల్లు గూడ గా కోతి శేతులకు మైదాకు పెట్టిండ్లు. ఇగ గా మైదాకు పెడ్తాంటే గా కోతి గింత గూడా కదల్లే, మెదల్లే. ఇంక గా శేతులకు పెట్టిన మైదాకుని సూసుకుంట, ఎర్రగైన గా శేతులను సూసుకుంట ఒకటే మురిసిపోయింది. ఇగ గా కోతిని సూత్తాంటే మస్తు గమ్మత్తనిపిస్తాంది గదా?

