
కొత్త ఇండ్లల్లకు పోతే గిట్ల , పండుగలకు పాలు పొంగిస్తం. ఇగ ఊకె పాలు పొంగియ్యం గద. పాలు పొంగిపోకుండ, గీ శిట్కా గిన్ని రోజులు తెల్వకపాయె. బుస్సున పొంగే పాల పొంగును శిటుక్కున శిటికెల ఆపే గీ శిట్కాను సూడుండ్లి.
పాలను యేడి సేయాలంటే గవాట్ని గా గిన్నెల పోస్తం. ఇగ గా గిన్నె పై అంచులకు గింతంత నూనె రాయాలె. అటెంక, దాన్ని పొయ్యి మీద పెట్టి యేడి సేయాలె. ఎంత మంట పెట్టినా గా పాలు ఇగ గా నూనె రుద్దిన అంచుల కాడికి బస్సుమని వస్తది. ఇగ గాడికి రావంగనే పొంగు తస్సుమని ఆగి పోతది. ఇగ పాలు పొంగిపోయి, గ్యాసంత అయిపోవుడు, గా పొయ్యంత ఖరాబు అవుడున్నదనట్లు. ఇగ గీ శిట్కా తెల్వక గిన్ని రోజులు ఎన్ని పాలు పొయ్యి పాలు శేసినం? ఎంత గ్యాస్ ను గా పాలను యేడి శేయడాన్కి యేస్టు చేసినం? ఎన్ని గంటలు గా పాలకాగ నిలబడ్డం? గీ శిట్కాను పాటించి సూడుండ్లి. మంచిగుంటే ఫాలో కాండ్లి. సమజైందా?

