
ఇగో గీ కాలంల సార్థం బాగా పెరిగిపోతాంది. అయ్యలేడు, అవ్వలేదు. అన్న లేడు, తమ్ముడు లేడ్. అక్కాశెల్లెల్లకు దిక్కు దివానం లేదు. వాయి వరసల్లేవు. మంచీ చెడు లేదు. పాపం పండుతాంది. ఎవ్వడు సూడు ఒకటే పైసల్! పైసల్!! పైసల్!!!
కలికాలం కాకపోతే, గిదేం మాయ రోగం? గిదేం పోయే కాలం? ఏకంగా సచ్చినోని సేతనే యేలి ముద్రలు ఏయించుకునుడేంది? గది గూడ గా యిషయం పక్కనోకి తెలవక ముందే దస్తకత్ ల కథ కానిచ్చేసుడేంది? నిజంగా గిది నిజమేనుల్లా… ఒకాయినెకు ఏమైందో ఏమో గనీ, గా కుర్సిల కూసున్నోడు కూసున్నట్లే పోయిండు. పానం పోయి గాయిన శవం గా కుర్సిల ఉండంగనే, మూడో కంటికి తెల్వకుండ, గా శవం ఏలి ముద్రలు ఏయించుకుని, ఆస్తులు కాజేసిండ్లు. ఆస్తుల మీద అత్యాశె ఇంతకు దిగజార్జింది? ఈ ఇంత గిదెవలో యీడియో దీసి సోసల్ మీడియల పెట్టిండు. అయిపాయె గిది చూసిన జనం గిదేం కలికాలం రా బాబూ! ముక్కున ఏలేసుకుంటాండ్లు!?

