
ఎన్కటికి గా బిస్కెట్లు, పిప్పరమెంట్లు, పుట్నాలు, పేలాలు, బూరు మిఠాయీలు తినేది. ఇగ గిది గూడ కొనలేనోల్లు…ఉంటరు గద. గవాల్లు, ఇగ శేతికి గింత గడియారం లెక్క శింతపండు, బెల్లం అంటిస్తిమా? ఇగ గదాన్ని గీక్కుంట, నాక్కుంట కూసునేది. ఈగలు వాల్తాంటే గవాట్ని కొట్టుకుంట ఆడుకునేది. ఐస్ప్రూట్లు శీక్కుంట కూసుంటే, గది గిన గింత మూతికి, శేతికి, ముక్కుకు అంటి, శారలు గట్టి ఉండేది.
ఇగ గా కాలం పాయె. కలి కాలం వచ్చె. ఇగ గిప్పుడు గవన్నీ మోటై పాయె. కొత్త కొత్త శాకిలెట్లు వచ్చె. కిండర్ జాయ్, ఎక్లేర్స్, డైరీ మిల్కు, మిల్కీ బారు, టూటీ ఫ్రూటీ, కిట్ క్యాట్టు, క్యాండీ, లాలీపప్పు, స్నిక్కర్లు, ఫైవ్ స్టార్, మంచ్, పర్క్, ఇంక రకరకాల చిప్స్, చెగోడీలు, ఎగ్, కర్రీ పప్పులు, కేకులు, పానీ పూరి, మామ్స్ మ్యాజిక్, హ్యాపీ హ్యాపీ, రకరకాల ఐస్ ప్రూట్లు, తమ్స్ అప్, స్ప్రైట్లు, మజా సల్లసల్లగ తాగే డ్రింకులు.. స్ట్రాబెర్రీ, మ్యాంగో, అవకాడో, బనానా, యాపిల్ ఫ్లేవర్ జెల్లీలు, టెడ్డీబేర్ జెల్లీ, జస్ట్ జెల్లీ.. గిట్ల సెప్పుకుంటూ పోతే, శాట బారతం, శాంతాడంత అయితది.
పొల్లగాండ్లు ఏడ్సిన, ఏడ్వకున్న, ముద్దు సేయడాన్కైనా గిఫ్టుల లెక్క ఇయ్యడానికైన గియ్యే కొనియ్యబడ్తిమి. ఇగ గివీటికి అల్వాటుపడ్డ పోరగాండ్లు ఊకుంటారు. గది కావలె. గిది కావల్నెని యేడుస్తుంటరు. గవాల్లను ఊకించాలంటే ఏం జేస్తరు? యెన్కటి లెక్క జోలపాట, లాలి పాటలు పాడ్తారు? ఇగ జెల్లీలు, లాలీపాప్ లు కొనిత్తిమా మన పనైపోతది. ఇగ గవాల్లే ఊకుంటరు!
ఇగ గా జెల్లీల లెక్క తేల్చిండొకడు. జెల్లీని ఓ బట్ట గుడ్డల తీస్కున్నడు. గదాన్ని ముడిసి, గట్టిగ పిండిండు. గదాంట్ల నీళ్ల లెక్క ఉన్నదంతా కారిపోయింది. బట్టి ఇప్పి సూసిండు. గదాంట్లె కెమికల్ అంతా మిగిలింది. గది బట్టకంటుకుని ఇగ పోతలేదు. వామ్మో! ఇగ గిదే గద మన పిల్లలకు తినిపిత్తాంది. బట్ట గుడ్డకు పోని కెమికల్ మన పొల్లగాండ్ల పేగులకు పట్టుకుని పోతాది. ఇగ పోరగాండ్లకు రోగాలు కాపోతే రాగాలొత్తాయి. ఇంకేమొత్తయి? గిది సూసినంక ఒల్లు జలదరించింది. మన పొల్లగాండ్లకు మనం యిషం పెడ్తానం గదా? గీ జెల్లీలు, శాకిలెట్లతో జెర బద్రం.

