
ఎంత మంచి పోనైనా కొంత టైమైనంక దాని సౌండ్ తగ్గుతది. మనం ముసులోల్లమైనంక కాళ్ళు, కీళ్ళు అరిగిపోవా ఏంది? గట్లనే ఇగ సిన్నగ ఇనపడతదన్నట్లు. ఇగ గా పోన్లు చేసేటోని దగ్గరికి పోతే, పోన్ కరాబైందని, కొత్త స్పీకర్ ఏయించుకోవాల్నని అంటడు. ఇగ ఫోన్ పనైపోయిందని కొందరు పక్కకు పడేస్తరు. ఇంకొందరైతే కొత్త పోన్ కొనుక్కుంటరు. యేలకు యేలు తగలేసి కొన్న పోన్ మీద, గా మోజు తీరక ముందే గది సిన్న సిన్నగ ఇనపబడితే సికాకుగుంటది గద! మన మాట గా ఎదుటోన్కి ఇయనబడది, గవాని మాట మనకు ఇయనబడది. గసొంటి పోన్ల గురించి ఫికర్ పడొద్దట. ఊకె పోన్లల్ల ఉండెటోడొకడు. గదానికి గూడ ఓ సిటికె కనిపెట్టిండు. గదేందంటే…
మీ ఫోన్ల సెట్టింగును తెరవాలె. గదాంట్లె సౌండ్ అండ్ వైబ్రేషన్ ను ఒత్తాలె. వ్యాల్యూమ్ తెరుసుకుంటది. ఇగ గదాని మీద కుడి బాజున మూడు సుక్కలుంటయి గద. గా మూడు సుక్కల మీద ఒత్తాలె. గది తెరుసుకోవంగనే, మీడియా వాల్యూమ్ లిమిట్ అని ఒకటి కనిపిస్తది. గది ఆఫ్ అని ఉంటే, గదాన్ని ఆన్ జేసుకోవాలె. దాని కిందనే ఉన్న వాల్యూమ్ లిమిట్ ని పెంచుకోవాలె. గంతే. గా ఫోన్ సౌండ్ మస్తుగ పెరుగుతదట. కొన్ని పోన్లల్ల గీ సెట్టింగ్సు తేడా గుంటే, ఎతికి సూసుకోవాలె. మరి గీ ఇకమతును మీ దగ్గరి దగ్గరి దోస్తులకు చెప్పుండ్లి. ఇగ పాత పోన్ ను పడేసే పనిలేదు, కొత్త పోన్ ను కొనే అక్కెర లేదు. గీ ఇకమతు మంచిగుంది గదా?
అడుగు ‘ట్రెండ్స్’ కు అభినందనలు

గత కొంతకాలంగా ‘అడుగు’ ఈ పేపర్ లో ‘అడుగు ట్రెండ్స్’ శీర్షికన వస్తున్న వార్తలకు ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ నూర్జాహాన్ అభినందనలు తెలిపారు. ‘అడుగు’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గం సాయి సందేశ్ తేజ కొత్త ట్రెండ్స్ కు, తెలంగాణ పాత యాసలో రాస్తున్న ట్రెండ్స్ ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. అంతేగాక ‘మనబ్బాయి మన భాషని, మన యాసని నిలుపుతుండటం గర్వంగా ఉంది’ అన్నారు. ‘అడుగు’ చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గంకు పంపిన వాట్యాప్ మెస్సేంజర్ ద్వారా చిరంజీవి సాయి సందేశ్ తేజకు ఓ ఆశీర్వాద సందేశాన్ని అందజేశారు.

