
ఇగో గీయన పేరు కైలాష్ ఖాన్. ఉత్తర ప్రదేశ్ మాజీ ముక్యమంత్రి అకిలేష్ యాదవ్ కి ఖాస్ దోస్త్. ఆ రాస్ట్ర సమాజ్ వాది పార్టీకి అధ్యక్షుడు. మాజీ ఎంపీ. అబ్బో బాగనే పదవులు సేసిండు గద. గీ గీయిన గురించి గిదంత ఎందుకంటాండ్లా? గదే సెప్తా ఇనుండ్లి.
గీయిన మీద గీ మద్య పోలీసులు 5 కేసులు పెట్టిండ్లు. అందుట్ల పురావస్తు శాక బూమి కబ్జా కేసు కూడా ఒకటి. ఇగ అయితే, కోర్టు యిచారించి, గాయిన్ను గా జిల్లాల్నే ఉండొద్దని హుకుం జారీ చేసింది. గాయన గా జిల్లా ఇడిసి పోకుండ, జిల్లాల్నె ఉండుకుంట.. పోలీసులకు సిక్కకుండ తప్పించుక తిరుగుతాండు. ఇగ పోలీసులు గాయిన కోసం ఎతికి ఎతికి అలిసిపోయిండ్లు. సూసీ సూసీ ఆరా తీసీ, తీసీ మెల్లంగ గాయిన దాక్కున్న తావు కనిపెట్టిండ్లు. గా తావు సూసి పోలీసులే నోరెల్ల బెట్టిండ్లు. గా తావు ఎక్కడుందనుకుంటాండ్లు? ఆయన ఇంట్లనే. ఎవలికి కనబడకుండ అటకెక్కి దాక్కుండు. గది తెల్వంగనే పోలీసులు గాయిన ఇంటికి పోయిండ్లు. పరుపును అడ్డం పెట్టుకుని, దాక్కున్న గాయిన్ని బయటకు లాగి, అరెస్టు చేసిండ్లు. గన్ని పదవులు జేసి, పెద్ద పేరు సంపాదించి, ఆ చిల్లర బుద్ధులేంది? అక్రమాస్తులు కూడబెట్టి, గిదేం పోయే కాలం? పక్క జిల్లాలుంటే వాని పానం ఏమైనా పోయిందా? సిగ్గు లేకుండ, గీ దాక్కునుడేంది? గీ గింత గ్యానం లేదా? అని అంతా చర్చించుకుంటాండ్లు.

