ఆవు పాలు పిండాల్నంటే గా పాలు మనం తాగేటంత వీజీ ఏం గాదు. ఆవు ఎదకు రావాలె. గా ఎదకు రావాల్నంటే, ఆవు పాలను లేగ దూడె ముందుగా తాగాలె. దూడె కొంచెం తాగంగనే దాన్ని, పక్కకు తప్పించి, యెదను కడిగి, పాలు పిండుతరు. లేగ దూడ లేకుండనే ఆవు ఎదకు రావాలె. పాలియ్యాలంటే ఎట్ల మరి? గీదీనికి గా ముసలోడు మంచి ఇకమతు కనిపెంట్టిండు. ఆవుకు గడ్డేసిండు. కట్టెలను లేగ దూడ లెక్క గట్టిండు. దానికి ఓ అంగి తొడిగిండు. గదాన్ని సూత్తె లేగ దూడ లెక్కనే ఉంది. ఇగ పాలు పిండినప్పుడల్లా గదాన్ని ఆవు పొదుగు దగ్గరకు తెస్తడు. లేగ దూడ పాలుదాగినట్లు చేస్తడు. ఇగ దాన్ని పక్కకు పడేసి, దబాదబా గా ఆవు పాలు పిండుతాండు. ఆవును మోసం చేసి, పాలను పిండి పాశం చేసుకుంటుండేమోగానీ, గీ ముసలోని ఇకమతు మంచిగున్నది కదా?

