
గిదో సింత ఇంత. గీ పపంచకం సిత్ర, విసిత్రాలకు నెలువు. ఇగ ఎనకటికి, గా బమ్మం తాత సెప్పినయన్నీ గూడ నిజమైతానయంటే ఏమో అనుకున్నం గనీ. ఇగ నమ్ముండ్లి. గట్లాంటి వాటిల్ల గిది గూడ ఒకటి. ఇగో గా ఊల్లె సింత సెట్టుకు మామిడి కాయలు గాత్తానయట. గదేంది? గమ్మత్తుగుంది. అనుకుంటాండ్లు గదా? నిజ్జంగా నిజమే చెబ్తాన. సూడుండ్లి.
మన పక్కనే ఉన్న ఆంద్ర పదేశ్ రాస్ట్రం, పచ్చిమ గోదారి జిల్లాల తణుకు మండలంల, తేతలి అనే ఊరుంది. గా ఊల్ల ఓ సింత సెట్టుకు మామిడికాయలు గాత్తానయట!? గిదేంది? గట్లెట్ల? యేడైన సింత సెట్టుకు సింతగాయ గాసుడు సుసినం… గనీ, గీ మామిడి గాయలు గాసుడేంది? గదే మరి… గదే గదా? గిదో సింత, యింత. గదేందో సూడాలంటే. గా తేతలి ఊల్లెకు పోవాలి. గిదేదో సిత్రంగ ఉందని గా సుట్టుముట్టు జనాలు గదాన్ని సూడ్డానికి ఎగబడతాండ్లట. మీకూ సూడాలని ఉందా? అయితే గా తేతలి ఊరికి పోదాం పదండ్లి.

