యెవలన్న తిక్క తిక్కగ మాట్లడితే, తల తిక్కగ వుందా? అంటం. తింగరి తింగరిగ, తిరుగుడు, తిరుగుడుగ, డొంక తిరుగుడుగ మాట్లాడితే, తల గిట్ల తిరుగుతుందా? అంటం. గీ తల తిరుగుడు మాటలతోనేంది గనీ, గా తల నిజంగనే తిరిగితే? యే సాలు తియ్ బయ్! మజాక్ గిట్ల జేస్తున్నవా? మస్తుగంటం గనీ, గా తల తిరుగుతదా యేంది? తిరుగుతున్నట్లనిపిస్తది గంతే! మనం గిర్ర గిర్ర తిరగమా? గప్పుడేమైతది? తల తిరినట్లనిపిస్తది. గని తల తిరగుతాదె? మంచిగ సెప్తనవు. తిరగనే తిరగదు. గప్పడే గద మన బూమి గుండ్రంగ తిరుగుతుందని తెలిసేది!? ఎకెసెక్కెలాడుతున్నవా యేంది? గిదంతా నిజమైతే, గా తల తిరుగుడు గూడ నిజమే!? ఎట్లంటే ఇగ మీర సూడుండ్లి.
గదేనుల్ల… మనిసికి తల ముందుకే సూస్తది. గా మాటకొస్తే, నీ, నా, మనందరి తల గూడ గట్లనె ముందుకే గద సూత్తది. గనీ, గీ పొల్లగాని తల యెనుకకు తిరిగి కూడా సూత్తది. ఆ..! ఎహె తియ్. గదెట్ల? గీ ముచ్చట గమ్మత్ గుంది? ముందుకు సూసే తల యెనుకకెట్ల తిరుగతది? గీ బూమ్మీదొట్టు. గా బూమి తిరిగినట్లే తిరుగుతాంది.
గా ఉత్తర్ పదేశ్ కు చెందిన గీ పోరడు, 18 యేండ్ల సోరోడు. దోస్తులతోని గలిసి సైకిల్ మోటర్ల మీద తిరుగుంటడు. గట్ల పోతుంటునే మధ్యల గిరుక్కున తలను యెనకకు తిప్పుతడు. ఇగ గిది సూసి, గప్పుడు గా సుట్టుపక్కల నుంచి పోయెటోల్లు అప్సోస్ అయితాండ్లంట. గీ వీడెంది? దయ్యమా? మనిషా? అని బయపడతాండ్లంట. గీ సంగత తెలసిన ఒకాయిన గా పోరన్ని యెతికి దొరకబట్టిండు. గవానెంట వాని దోస్తులు గూడ ఉన్నరు. గా పొలగాన్ని నిలబెట్టి, నువ్ నిజంగనే తల తిప్పుతవా? అంటె. ఆ తిప్పుత అన్నడు. నీకేం బయం లేదా? అంటె, లేనే తేదన్నడు. ఎంత మేర తప్పుతవ్? అంటే మొత్తం యెనుకకే తిప్పత. అన్నడు. ఎంతసేపు గంట్లుంట్? అంటే, గదాందేముందు రొండు నిమిషాల్, ఐదు నిమిషాల్, అర గంట గూడ అట్లనే ఉంటనన్నడు. గిదేదో తమాషాగుందని, తిప్పి సూపమన్నడు. గా పొల్లగాడు గిరుక్కున తలప్పిండు. ముందుకు సూసే తల పూర్తిగ ఎనక్కిపోయింది. గా పోరడు గాడికి ఆగిపోలే, గా యెనక నుంచి గూడ మాట్లాడబట్టిండు. అంతా పరేషాన్ అయిండ్లు. గిట్ల యెప్పుడన్న తిప్పినవా? అంటే లేదు. రొండు నెలల గానుంచే తిప్పుతున్న అన్నడు. ఇగ గిదీన్ని గాయిన యీడియోల దీసిండు. తలను యెనక్కి తిప్పేటప్పుడైతే దగ్గరగ సూపిండు. సొసల్ మీడియల సేర్ సేసిండు.
అరె గిదేంది బయ్? బలే గమ్మత్ గి తప్పిండు? అనుకుంట అంతా సూస్తుండ్లు. సూసినోడు సూసినట్లే పరేషాన్ అయితాండ్లు. గిదేదో మంచిగుందని, గిట్ల తిప్పితే అంతా మనల్నే సూత్తరని, గాయింత మీరు గిట్ల తిప్పేరు? కాసేపు అటు గిటు సూత్తనే మెడలు నొత్తయి. గాయింత గీ ఫీట్ సేత్తిరా? ఇగ యెట్లుంటదో సూడుండ్లి. గా మెడలు పుటుక్కున ఇరుగుతయి. మెడనరాలు సిటుక్కున తెగుతయి. ఇగ తిరుగుడే లేకుండ, యేళ్లాడపడ్తయి. జెర జాగ్రత్త!
https://www.facebook.com/share/r/1676PXi8mG/

