Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

కోర్టుల వ్యాఖ్యలు వ్యవస్థల లోపాలకు హెచ్చరికలు!|EDITORIAL

దేశంలో ఒకేసారి వెలుగులోకి వచ్చిన రెండు సంఘటనలు రాజ్యాంగ వ్యవస్థల మధ్య సంబంధాన్ని, అలాగే చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేశాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు చేసిన వ్యాఖ్యలు, ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై వచ్చిన వివాదాస్పద పాఠ్యాశంపై సుప్రీంకోర్టు స్పందనల, ఈ రెండు సందర్భాల్లోనూ, కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఒక కేసులో కోర్టు వ్యాఖ్యలు, అది కేవలం ఆ కేసుకు సంబంధించినది మాత్రమే కాదు. వ్యవస్థ లోపాలకు సూచిక. హెచ్చరిక కూడా.

కోర్టులు ప్రశ్నించడమంటే ప్రభుత్వాన్ని బలహీనపరచడం కాదు. బాధ్యతలను గుర్తుచేయడమే. అదే సమయంలో ప్రభుత్వం కూడా విమర్శలను స్వీకరించి, లోపాలను సరిదిద్దుకోవాలి. ప్రతిష్ఠను కాపాడుకోవడం అంటే విమర్శలను అణచివేయడం కాదు. విశ్వసనీయతను పెంపొందించుకోవడం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

దేశ రాజకీయ-న్యాయ పరిణామాల్లో ఒకేసారి వెలుగులోకి వచ్చిన రెండు సంఘటనలు దేశ రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఉన్న సంబంధాన్ని, అలాగే చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేశాయి. ఒకటి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు చేసిన వ్యాఖ్యలు కాగా, మరొకటి ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై వచ్చిన వివాదాస్పద పాఠ్యాశంపై సుప్రీంకోర్టు స్పందన. ఈ రెండు సందర్భాల్లోనూ కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి ప్రశ్నార్థకంగానే మిగిలింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ కేసులో అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత వంటి ప్రముఖులను అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. దర్యాప్తు చేసిన సీబీఐ, ఈడిల చర్యలపై మొదటి నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వెలుబుచ్చిన తీర్పు, చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు న్యాయ పరమైన బలాన్ని చేకూర్చాయి.

కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం, ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం కచ్చితమైన సాక్ష్యాధారాలతో జరగాలి. లేకపోతే అది వ్యక్తుల స్వేచ్ఛపై దాడి చేయడమే అవుతుంది. రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని, మాజీ ఉపముఖ్యమంత్రిని జైలులో పెట్టేంత తీవ్ర ఆరోపణలు ఉంటే, వాటికి తగిన సాక్ష్యాధారాలు ఉండాలి. ముందస్తు పర్మీషన్లు తీసుకోవాలి. అలా జరగకపోవడం వల్ల దర్యాప్తు సంస్థల విశ్వసనీయతకే భంగం కలిగింది. రాజకీయ కక్షసాధింపుల ఆరోపణలు మరింత బలపడ్డాయి.

అవినీతి, ఆర్థిక నేరాలపై కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత సీబీఐ, ఈడిలదే. అదే సమయంలో నిష్పాక్షికత, చట్టపరమైన కట్టుదిట్టత, సాక్ష్యాలాధారిత దర్యాప్తు అత్యవసరం. లేకపోతే దర్యాప్తు సంస్థలు రాజకీయ ఆయుధాలుగా మారాయన్న అపవాదుకు జవాబివ్వడం కష్టమే. ఒక కేసులో కోర్టు తీవ్ర వ్యాఖ్యలు, అది కేవలం ఆ కేసుకు సంబంధించినది మాత్రమే కాదు. వ్యవస్థ లోపాలకు సూచిక. ఒక హెచ్చరిక కూడా.
ఇక ఎన్సీఈఆర్‌టి పాఠ్యాంశ వివాదం మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ప్రచురించిన ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే అంశం చేర్చడం వివాదమైంది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్వయంగా సుమోటోగా విచారణ చేపట్టింది. న్యాయవ్యవస్థ గౌరవం పోయేలా, ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించేలా పాఠ్యాంశాలు ఉండకూడదని కోర్టు ఆగ్రహించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇచ్చినప్పటికీ, ఆ అధ్యాయాన్ని వెనక్కి తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించడం ప్రభుత్వ పర్యవేక్షణ లోపాలను ఎత్తి చూపింది.

ఈ రెండు ఘటనల సారాంశమేంటంటే, దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రభావాలకు అతీతంగా ఉండాలి. విద్యా సంస్థలు సున్నిత అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న వ్యవస్థలపై ఆధిపత్యం కాకుండా సమగ్ర పర్యవేక్షణ కలిగి ఉండాలి. లేకపోతే కోర్టుల జోక్యం తప్పదు.
ఇక అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి సందేహం ఉండకూడదు. కానీ ఆధారాల్లేకుండా కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం, తర్వాత కోర్టులో నిలబడలేకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తుంది. అలాగే విద్యా రంగంలో సున్నిత అంశాలను చేర్చేటప్పుడు సమగ్ర చర్చ, నిపుణుల సలహాలు అవసరం.

ప్రజాస్వామ్యంలో న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల మధ్య పరస్పర నియంత్రణ అత్యంత కీలకం. కోర్టులు ప్రశ్నించడమంటే ప్రభుత్వాన్ని బలహీనపరచడం కాదు. బాధ్యతలను గుర్తుచేయడమే. అదే సమయంలో ప్రభుత్వం కూడా విమర్శలను స్వీకరించి, లోపాలను సరిదిద్దుకోవాలి. ప్రతిష్ఠను కాపాడుకోవడం అంటే విమర్శలను అణచివేయడం కాదు. విశ్వసనీయతను పెంపొందించుకోవడం.
ఇప్పటికైనా కేంద్రం సహా అన్ని ప్రభుత్వాలు సంస్థల స్వతంత్రతను కాపాడాలి, పారదర్శకతను పెంపొందించాలి. చట్టపరమైన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి. వ్యక్తులు కాదు, వ్యవస్థలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News