ఎన్కటికి బంక కావాల్నంటే, శెట్టు శేమలు తిరిగీ, తిరిగి తుమ్మ శెట్టు, యేప చెట్లకు ఏరుకుని వచ్చేది. గదాన్ని నీల్లల్ల నానబెడితే బంకయ్యేది. ఇగ గిప్పుడైతే గా శెట్లకు ఎవలు పోతాండ్లు? దుకాన్లకు పోయి కొనుక్కొచ్చుడేనాయె? ఇగ ఇంట్లనే గా గ్లూని కర్సు ఎక్కువ లేకుండ శేసుకోవచ్చన్నట్లు?
గింత పెట్రోల్ ను ఓ శిన్న గిన్నె లేకపోతే ఓ ప్లాస్టిక్ కప్పుల తీసుకోవాలె. గండ్ల థర్మాకోల్ ను తగినంత ఏయాలె. కొద్దిసేపట్లనే గది బంకబంకగైతది. గా బంకను పేపర్లు, పుస్తకాలకే కాదుల్లా… ఏకంగా ఇరిగిన శెప్పులసొంటి వాటిని గూడ అతికిపియ్యొచ్చు? గ్లూ, బంక, ఫెవికాల్, ఫెవి స్టిక్ లసొంటాటితోటి ఇగ పనే లేదు. ఎట్లుంది గీ ఇకమతు? మీరూ చేయుండ్లి మరి.

