ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడని ఊకూకనే అనలే. గాయింత ఇకమతులున్నోల్లదే పపంచకం. గట్లనే గీ రైతు శేసిన ఉపాయం సూడుండ్లి. ఎంత గమ్మతుగుందో?

రైతులు పొలాలకు నీల్లు పెట్టాల్నంటే మస్తు కట్టపడ్తరు. ఒక మడిల కెల్లి నీల్లను మరో మడిలకు తోలాల్నంటే ఒరానికింత గండి పెట్టాలె. ఆపాల్నంటే మల్ల గా గండిని మూయాలె. ఇగ గది ఒకోపాలి పెద్దగైతది. ఇంకోపాలి శిన్నగైతది. గీదీంతోటి గా దాంట్ల మస్తు నీల్లు పోతయి. గదంత గాకుండ ఓ రైతు ఒరంల మద్దెల కింద కోసిన ప్లాస్టిక్ సీసను పెట్టిండు. ఇగ నీల్లు పారాల్నంటే గా సీస మూత తీస్తడు. వద్దనుకుంటే గా మూత బిర్రుగ పెడ్తడు. ఒరాలు గట్టిగుంటయి. సుక్క నీల్లు ఉట్టిగ పోవు. ఎట్లుంది గీ శిట్కా!? గిది సదివినోల్లు… మీకు తెల్సిన రైతులకు సెప్పుండ్లి!

