యాడికి పో.. మంచినీల్లంటే సీసాలే. ఇంట్ల సల్లగ నీల్లు తాగాల్నంటే గా ప్రిజ్జులల్ల సీసాలే పెట్టాలె. గట్లనే యేడి నీళ్ళకు కూడ సీసాల్నే ఆడుతాండ్లు. గవేమో ఎనకటి లెక్క గాజుయి కావాయె. అయితే ప్లాస్టిక్ యి, లేకపోతే స్టీలుయి. ఇగ అడాడ రాగియి గూడ ఆడుకుంటాండ్లనుకోండ్లి. మరి గా సీసాల్ని కడగాల్నంటే మస్తు కట్టమైతది. లోపలకు శెయ్యిపోదు, పత్యేకంగా బ్రష్ లతోటి కడిగినా, గా ఆసన పోదు. మరేం శేయాలె? ఇగో గీ కిటుకు సూడుండ్లి.

గా సీసాల గిన్నన్ని బియ్యం పొయ్యాలె. గదాంట్లనే గింత ఉప్పెయ్యాలె. ఇగ గిన్ని నీల్లు గూడ పోసి, మూత పెట్టి ఓ పావుగంట ఉంచాలె. తర్వాత బాగా అటు ఇటు ఊపి, కడిగాలె. అయిపాయె! ఇగ గా సీసాలు మంచిగ సుభ్రమైతయి. ఆసన గూడ రాదు. కావాల్నంటే శేసి సూడుండ్లి.

