ఇగో మనలో శాలా మందిమి గుడ్లను తింటం. కూరొండుకొనో, ఆమ్లెట్ పోసుకునో, ఎగ్ ప్రై రైస్ చేసుకునో, నూనెల గోలిచ్చుకునో, అంటు పులుసు పెట్టుకునో…తీరొక్క తీరుగ తింటుంటం. మరి గా గుడ్డు అప్పుడప్పుడు సీ గుడ్లయితయి! గదేనుల్ల… గా గుడ్లు కరాబైతయి. గా గుడ్లు మంచియా? కాదా? ఎట్ల తెలువాలె? గదానికి గూడ ఓ ఇకమతుందుల్లా!

ఇగ గుడ్డు వెరీ గుడ్డేనా కాదా? తెలుసుకోవాల్నంటే… గుడ్డును తీసుకోవాలె. మన పోన్లల్ల అన్నింటికీ టార్చి లైటు ఉంటది గదా. గదాన్ని ఎలిగియ్యాలె. గా లైటు ఎలుతురుకు గా గుడ్డును పెట్టాలె. పసుపు పచ్చగా రంగు దేలి కనబడితే గది మంచిగుడ్డన్నట్లు. ఒకేల గది గా లైటు ఎలుతురుకు కూడ తెల్లగనే కనబడ్డదనుకోండ్లి. గది సీ గుడ్డన్నట్లు. మంచుగుందిగదా గీ శిట్కా..! ఇగ, మీరు తినే గుడ్డు వెరీ గుడ్డో కాదో తెలుసుకోండ్లి.

