ఆలుగడ్డతోటి ఏ వంట వండిన ఆల్ రైట్గ ఉంటది. వాతం, పీతం అంటరు గని, కమ్మగుంటది. గా ఆలుగడ్డతోటి నొప్పులు నయమవుడే గాదుల్లా… అద్దాలను మెరిపించే అద్భుత గుణం గూడ ఉందట!

మనం సూసుకునే అద్దం కానుంచి… కార్లు, లారీలు, బస్సులు, సైకోల్ మాటర్లు.. ఇగ యే అద్దమైనా గా ఆలుగడ్డలతోటి మిలమిల మెరుస్తయట! ఆలు గడ్డను తీసుకోవాలె. గదాన్ని రెండు ముక్కలుగ కోయాలె. ఒక ముక్కతోటి గా అద్దాలను రుద్దాలె. గా తర్వాత గిన్ని నీళ్ళు పోసి తుడ్వాలె. అయిపాయె. గా అద్దాలు మిల మిల మెరిసి, సూపు గూడ బాగ కనిపిస్తదట. ఇగ నీళ్ళు పోసి, బట్టతోటి రుద్ది, పేపర్లతోటి తుడిసే పనేలేదు. మరి మీరు శేసి సూడుండ్లి!

