గా గుర్రం మూతులతోటి మస్తు ఇబ్బందైతది. కాలి మడిమల బొక్క పెరుగుడు. చెడు రత్తం గడ్డ కట్టుడుతోటి, ఇగ గా కాలుని కదపాల్నంటేనే కట్టమైతది. పొద్దుపొద్దుగాల అడుగుదీసి అడుగు పెట్టరాదు. ఇగ గాడ రాసుకపోయినా, గీసుకపోయినా, ఒత్తుకపోయినా, పానం ఎల్లిపోతాంటది. మరి గదానికి గీ శిన్న శిట్కా సూడుండ్లి.

ఒక ఉల్లి గడ్డను తీసుకోవాలె. గదాన్ని సగానికి కోయాలె. గా సగం కోసిన ఉల్లిగడ్డను ఓ గిన్నెల లేకపోతే పెనం మీద కాలు నొప్పికి తగ్గ యేడి శేయాలె. ఇగ గదాంతోటి నొప్పికాడ అద్దాలె. గట్ల అద్దంగ అద్దంగ.. గా గుర్రం మూతులు తోక ముడుస్తయట! నిజంగనే గదా? గా ఉల్లి శేసే మేలు తల్లి గూడ శేయదంటరు? మరి మీరేమంటరు?

