ఎనుకటికి శీకట్ల గా దీపాల కిందనే రాత్రుళ్ళు గడిశేది. ఇగ కరెంటొచ్చినంక, గా దీపాలను దిడ్లనే పెట్టినం. ఎలిగిత్తే ఒట్టు! ఇగ గిప్పుడు జనం పెరిగిపోయినంక… గా కరెంట్ తయారు సేసుడు గూడ కనా కట్టంగా మారింది. బొగ్గుతోటి చేద్దామంటే గా బొగ్గే దొరుకుతలేదు. ఇగ నీల్లతోటి సేసే కరెంటు సరిపోతలేదు. గందుకే గా కరెంటుకు జాగల ఎండతోనే ఎలిగే కరెంటు బుగ్గలను కనిపెట్టండ్లు. ఇగ గా కరెంటు కావాల్నంటే అంతా మిద్దెల మీద, మేడల మీద గా సోలార్ పలకలు పెట్టుకుంటాండ్లు. కనీ గా ఆంద్ర దేశంల వీరవల్లి అనే ఊరాయనెకో ఇకమతు తోసింది. యెంటనే అమలు శేసిండు.

గాయినె అందరిలెక్క సోలార్ పలకలను ఇంటి మీద పెట్టలే. ఇంటి ముందుర ఓ షెడ్డు లెక్క యేసిండు. మంచిగ గా షెడ్డు కింద కారును పార్కింగ్ చేసుకుంటాండు. ఎండతోటి కరెంటుకు కరెంటు రాబట్టె. కారుకు నీడనీయబట్టె. మంచిగుంది గద గీ ఇకమతు!

