ఎన్నేసినా నన్నేయకపోతే ఏం బాగుంటదని ఉప్పంటే, ఎన్నేసినా, నన్నేస్తేనే కూర బాగుంటదని ఎల్లిపాయె అంటదట! యే కూరల్నైనా, గింత అల్లం ఎల్లిపాయె ముద్దెయ్యకపోతే రుశే ఉండదాయె!! గందుకే మన ఆడోల్లు అల్లం ఎల్లిపాయె నూరేందుకు ఎన్ని తిప్పలైనా పడతరు. ఇగ ఎల్లిపాయె పొట్టు తీయడానికైతే గడ్డల్ని ఒలిసి, గొరుతోటి ఒక్కొక్క పాయ పొట్టు తీస్తరు. యేల్లు, గోర్లు నొత్తాంటే.. గిదంతా పని కాదని, గింత మంచినూనె రాశి, ఎండల ఎండబెట్టి, ఓ బత్తల యేసి, నలుస్తరు. కొందరైతే గవాట్ని బండకేసి కొడతరు. ఇగ మల్ల గప్పుడు పొట్టు తీసుడు మొదలు పెడ్తరు. అమ్మలక్కలు అంతా కలిసినా, ఇగ గా అల్లం, ఎల్లిగడ్డలతోటి రెండు మూడు రోజులు పొద్దుపోతది.
ఇగ గిదంత పనికాదని, ఓ ఉపాయం కనిపెట్టిండ్రుల్లా…! ఎల్లిగడ్డలను పాయలు పాయలుగ ఒలువాలె. గవాట్ని మునిగేటట్లు మంచినీల్లల్ల పోయాలె. గింత ఉప్పేసి కాసేపు నానబెట్టాలె. ఇగ గవాట్ని ఒలుస్తాంటే, పొట్టు ఊకూకెనె ఊడి పోతాంటది. కావాలంటే మీరూ ఈ ఉపాయం శేసి సూడుండ్రి. మీ మీదొట్టు! పోకపోతే దేకికైనా బెట్టు!!

