
మనిసికి లోకం మీద పేమ కంటే, పానం మీద తీపే ఎక్కువ. ఎవలికైనా శానా కాలం బతకాల్ననే ఉంటది. గదైతాది. ఎవలికి ఎంత రాసి పెట్టి ఉంటే గంతే? అనుకుంటుం గనీ, ఇగో.. గీ బ్లడ్ గ్రూపు రక్తపోల్లు తొందరగ ముసలోల్లు కారట. తొందరగ సావరట. ఆ గదేంది? గట్లెట్లుంటది?
గీ మద్దెల గా ప్లానెట్ టుడే ఓ సర్వే చేసింది. ఎక్కువ కాలం బతికేటోల్ల బ్లడ్ గ్రూపుల లెక్కను తీసింది. గది సూసిన గా సర్వే చేసినోల్లే ఇచ్చెంత్ర పోయిండ్లట! బి-బ్లడ్ గ్రూపున్నోల్లు తొందరగ సస్తలేరట! శాలా కాలం బత్తాండ్లట. గంతేకాదుల్లా… గవాల్లు ఏజైపోయినట్లు కనిపిస్తలేరట. వయసైపోయినా గూడ గట్టిక పిక్కలెక్క ఉంటాండ్లట. గ వాల్ల రక్తంల పునరుత్పత్తి ఎక్కువట. కణజాల నిర్మాణం గూడ గట్టిగుందట. గవి సురుగ్గా పని శెస్తానయట. ఇంకేంది ముందుగ మీ బ్లడ్ గ్రూపు ఏందో సూసుకోండ్లి. ఐటెంక గీ ముచ్చటను మీ దోస్తులతో పంచుకోండ్లి. అన్నట్లు అందరికీ దసరా శుభాకాంక్షలుల్లో!

