పొరపాటుగ బంగారం ఉంగురంపోతే ఏం సేత్తం? దబదబ యెత్కుతం. గదే ఓ బురదలోనో, నీటిలోనో పడిపోతే ఏం సేత్తం? ఇంకా ఆగమాగమైపోతం. అసలే బంగారం ధర పెరిగిపాయె. గిదీనికి గూడ ఓ ఇకమతు ఉంది. సూడుండ్రి.

ఓ సంచి, గదేనుల్ల పాల్తిన్ కవర్, క్యారీ బ్యాగు తీసుకోవాలె. గదాంట్ల తెల్లగ శుభ్రంగ ఉన్న మంచినీటిని పోయాలె. గదాన్ని గట్లనే గా బురద, నీటిలోకి మెల్లెగ దించాలె. పోయిన గా బంగారం ఉంగురం ధగధగమని మెరుస్తూ కనిపిస్తది.

