Trending News
Friday, February 20, 2026
21.2 C
Hyderabad
Trending News

ప్రణాళికలతో ‘సాగ’డమే శ్రేయస్కరం|EDITORIAL

నీటి నిర్వహణలో స్పష్టత, ప్రాధాన్యతా క్రమం, కార్యాచరణలే అభివృద్ధికి అసలైన బలమైన పునాదులు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికాకుండానే కొత్త ప్రతిపాదనలను, ప్రణాళికలను సిద్ధం చేయడం, రాజకీయ వ్యాఖ్యలతో వివాదాలను రేకెత్తించడం మామూలైపోయింది. ఇది సాగు, మంచినీటి వంటి జీవనాధార విధానాలలో సరైన పంథా కాదు.

పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టు పదేళ్ళైనా పూర్తికాకపోవడం ఆందోళనకరం. దీంతో ప్రాజెక్టు వ్యయభారం పెరుగుతూ కాలయాపనకు గురవుతోంది. ఏడాదికేడాది నిర్మాణ ఖర్చులు పెరుగుతుండగా, ఆశించిన ప్రయోజనాలు నెరవేడంలేదు. తాజాగా 2027 జూన్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు, కానీ, దానిక నుగుణంగా దశలవారీ కార్యాచరణ, నిధుల సమీకరణ, పారదర్శక అమలు అవసరం. పోలవరం పూర్తయితేనే సాగు, తాగునీరు, వరద నియంత్రణ, జలవిద్యుత్ వంటి అనేక ప్రయోజనాలు సాకారం అవుతాయి.

ఇదిలా ఉండగా, నల్లమల సాగర్ ప్రాజెక్టు వంటి కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చి, ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు, ఉద్రిక్తతలకు తావివ్వడం సముచితం కాదు. నీటి విషయాలు భావోద్వేగాలతో కాకుండా, శాస్త్రీయ అవగాహనతో, పరస్పర ప్రయోజనాలు, సహకారం, గౌరవంతో చర్చించాల్సినవి. నదీజలాల వినియోగంపై సంయుక్త సాంకేతిక కమిటీలు, డేటా ఆధారిత చర్చలు, పారదర్శక ఒప్పందాలు ఉండాలి. పరస్పర ఆరోపణలు, రాజకీయ ప్రయోజనాలకు తోడ్పడవచ్చు కానీ, ఆయా రాష్ట్రాలకు, రైతులకు మాత్రం ప్రయోజనం చేకూర్చవు.

అదేవిధంగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, విచారణలు, దోషులు, శిక్షలు వంటివి వేగంగా తేల్చాల్సినవి ఆలస్యమవడం రాజకీయ సంకల్ప లోపం. అయితే, విమర్శలు చేయడం కంటే, సాంకేతిక లోపాలుంటే సమీక్షించి సరిదిద్దడం అవసరం. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టులను రాజకీయ ప్రయోజనాల వాదోపవాదాల బలి పీఠం మీద నిలబెట్టడం సమంజసం కాదు.

ఇటీవల నీటి వినియోగంపై కొత్త పాలసీ, రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు వంటి వార్తలు చర్చనీయాంశమయ్యాయి. నీటి సరఫరా ఖర్చులకు అనుగుణంగా యూజర్ ఛార్జీలు విధించాలనే ఆలోచన వస్తున్నది. నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ఈ వాదనలో కొంత తార్కికత ఉన్నప్పటికీ, సాగునీటిపై అదనపు భారం రైతులకు పెనుభారమవుతుంది. ఇది రైతుల వ్యతిరేకతకు దారి తీసే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ జల సూత్రాల ప్రకారం మంచినీరు, సాగునీరు, జలవిద్యుత్, పరిశ్రమల ప్రాధాన్యతా క్రమాన్ని పాటించాలి. వ్యవసాయ రంగం ఇంకా అస్థిర పరిస్థితుల్లోనే ఉండగానే, పరిశ్రమలకు ముందస్తు ప్రాధాన్యం ఇవ్వడం ఉపాధి అవకాశాలు పెంచుతాయి కానీ, దేశ, రాష్ట్రాల ప్రగతికి సరైన దశ, దిశను నిర్దేశించలేవు.

రైతాంగం లాభాల బాట పట్టే విధంగా, నీటి వినియోగాన్ని విరివిగా వినియోగించే వరిసాగు తగ్గించి ఉద్యాన పంటలు, తృణ ధాన్యాలు ప్రోత్సహించాలనే సూచనలు సూత్రప్రాయంగా మంచివే. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం కాలానుగుణ అవసరం. అయితే భూసార అనుకూలత, నీటి లభ్యత, మార్కెట్ పరిస్థితులు, నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు వంటి అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం రైతులకు నష్టదాయకం. పంటల మార్పు ఒక దీర్ఘకాలిక వ్యూహంగా, ప్రోత్సాహకాలతో, అవగాహన కార్యక్రమాలతో అమలు చేయాలి. హడావుడిగా కాదు.

రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి వంటి అనేక నదులు, వేలాది చెరువులు ఉన్నా వాటి సామర్థ్య వినియోగం పూర్తిస్థాయిలో జరగడం లేదు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడం, పరిగెత్తే నీటిని నిల్వ చేయడం, చెరువుల పునరుద్ధరణ, కాల్వల ఆధునీకరణ వంటివేవీ జరగడంలేదు. ‘నడిచే నీటిని నిలబెట్టాలి. నిలిచిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి’ అనే ఆలోచన ఇప్పటికైనా కార్యరూపం దాల్చాలి.

రాజకీయాలకంటే ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం, పరిపాలనా దృఢత్వం అవసరం. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, పారదర్శకంగా జల విధానం, రైతు కేంద్రంగా నిర్ణయాలు, రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వక సయోధ్యలే నీటి వివాదాలకు శాశ్వత పరిష్కార మార్గాలు. సమగ్ర నీటి యాజమాన్య ప్రణాళికతోనే వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు సుసాధ్యం. లేకపోతే కొత్త ప్రతిపాదనలు, పాత వివాదాలు, పెరుగుతున్న వ్యయభారాలే మిగిలిపోతాయి. పక్కా ప్రణాళికలు, ప్రాధాన్యతా క్రమంతో ‘సాగ’డమే శ్రేయస్కరం.

Latest News

పెండ్లి పిల్ల మీద నో(కో)ట్ల కట్టలు!?|ADUGU TRENDS

పెండ్లంటే నూరేళ్ళ పంట. గందుకే ఆకాసమంత పందిరి, భూదేవంత పీటలేసి పెండ్లిల్లు శేత్తరు. ఉన్నోల్లు కోట్లకు కోట్లు కర్సు పెడ్తరు. కనీ, గీ వీల్లు గవన్నీ శేసిండ్లు. గంతకు మించి, పెండ్లి పిల్ల...

జెండాలకతీతంగా అభివృద్ధి ఎజెండా!|EDITORIAL

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. ఇక రాజకీయాలు పక్కన పెట్టేయాలి. ప్రజలు ఎదురుచూస్తోన్న అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. గ్రామాలు, పట్టణాలు బలపడితేనే రాష్ట్రం, దేశం బలపడుతుంది. ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ఎజెండాను...

గురువారం, ఫిబ్రవరి 19–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--శుక్లపక్షం తిధి విదియ సాయంత్రం 04.35 వరకు ఉపరి తదియ నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 09.43 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం సిద్ద రాత్రి 09.45 వరకు ఉపరి సాధ్య కరణం కౌలవ సాయంత్రం 04.36...

ఇనుప సువ్వలతో దెండెం ఇకమతు!?|ADUGU TRENDS

ఇంటి మీద, మిద్దెల మీద, మేడల మీద బట్టలారేసు కోవాల్నంటే మస్తు తిప్పలైతది. దండాలు కట్టాల్నంటే కూడా కట్టమే. గిదీనికి ఓ ఇకమతు ఉంది. కవాల్నంటే సూడుండ్రి. గీ పోటువల సూపినట్లు.. ఇనుప సువ్వతోటి...

మనం-వనమే జీవావరణం!|EDITORIAL

ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వన్యప్రాణులు గ్రామాలు, పట్టణాలలో సంచరించడం ఆందోళనకరంగా మారింది. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవిపందులు, ఏనుగులు, కోతుల దాడులు కూడా పెరిగిపోతున్నాయి. వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడానికి ప్రధాన...

బుధవారం.ఫిబ్రవరి 18–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--శుక్లపక్షం ఫాల్గుణ మాసం ప్రారంభం తిధి పాడ్యమి సాయంత్రం 05.20 వరకు ఉపరి విదియ నక్షత్రం శతభిషం రాత్రి 09.54 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శివ రాత్రి 11.35 వరకు ఉపరి సిద్ద కరణం బవ...

బంగారాన్ని బయటికి తీసే ఉపాయం!?|ADUGU TRENDS

పొరపాటుగ బంగారం ఉంగురంపోతే ఏం సేత్తం? దబదబ యెత్కుతం. గదే ఓ బురదలోనో, నీటిలోనో పడిపోతే ఏం సేత్తం? ఇంకా ఆగమాగమైపోతం. అసలే బంగారం ధర పెరిగిపాయె. గిదీనికి గూడ ఓ ఇకమతు...

మంగళవారం, ఫిబ్రవరి 17–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు మాఘమాసం--కృష్ణపక్షం తిధి అమావాస్య సాయంత్రం 05.32 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ధనిష్ఠ రాత్రి 09.37 వరకు ఉపరి శతభిషం యోగం పరిఘ రాత్రి 01.06 వరకు ఉపరి శివ కరణం నాగవ సాయంత్రం 05.34 వరకు ఉపరి...

సోమవారం, ఫిబ్రవరి 16–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు మాఘమాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.17 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం శ్రవణ రాత్రి 08.50 వరకు ఉపరి ధనిష్ఠ యోగం వరీయాన్ రాత్రి 02.11 వరకు ఉపరి పరిఘ కరణం శకుని సాయంత్రం 05.18 వరకు ఉపరి...

శివ నామస్మరణతో మారుమ్రోగిన పాలకుర్తి|PALAKURTHI|SHIVARATRI

భక్తుల స్మరణతో పులకించిన సోమన్న గుట్ట ఘనంగా సోమన్న కళ్యాణం పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే యశస్విని సోమన్నను దర్శించుకున్న పలువురు ప్రముఖులు జనగామ జిల్లా, పాలకుర్తిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి పారవశ్యంతో కళకళలాడింది. శ్రీ సోమేశ్వర...

జీపీఓల వ్యవస్థ – అవస్థలు – పరిష్కారాలు|GPO|TELANGANA|ARTICLE

నిజాం కాలం నాటి పటేల్–పట్వారీ వ్యవస్థ నుంచి నేటి జీపీఓల దాకా వచ్చిన మార్పులు గ్రామ పరిపాలన స్వరూపాన్నే మార్చేశాయి. అయితే, ప్రతి మార్పు కొత్త అవకాశాలతోపాటు సరికొత్త సవాళ్లను కూడా మోసుకొచ్చింది. సాయి...

కజ్జూర పండ్ల గింజల్ని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

కజ్జూర పండ్లంటే ఎవరికైన ఇట్టమే. లొట్టలేసుకుంట చప్పరిస్తం. ఇగ శిన్న పిల్లలైతే గయి మస్తుగ తింటరు. గయి మనకు మస్తు బలాన్నిస్తయి. గయి గీ కాలంలనే దొరుకుతయి. గవాటిని నోట్లేసుకుని, పండును తిని...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News