Trending News
Thursday, February 5, 2026
25.2 C
Hyderabad
Trending News

న్యాయం కోసం ‘న్యాయవాది’గా సీఎం మమతా బెనర్జీ|ESSAY|MAMATHA BENARJEE

భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక అపూర్వ ఘట్టం, దేశ అత్యున్నత న్యాస్థానంలో బుధవారం ఆవిష్కృతమైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒక రాష్ట్ర అధినేతగానే కాకుండా, న్యాయ పరిరక్షకురాలిగా నల్ల కోటు ధరించి, సుప్రీంకోర్టులో వాదించి, యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఒక ముఖ్యమంత్రి స్వయంగా న్యాయవాదిగా వాదనలు వినిపించడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే ప్రథమం. చట్టసభలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య ఉన్న సున్నిత రేఖలను చెరిపేస్తూ, ప్రజాక్షేత్రం నుండి నేరుగా న్యాయక్షేత్రానికి తరలిరావడం ప్రజాస్వామ్య పోరాట పటిమకు నిదర్శనం. న్యాయమూర్తుల ముందు ఆమె వినిపించిన గళం కేవలం ఒక రాజకీయ వాదన మాత్రమే కాదు. అది ప్రజాస్వామ్య పునాదులను కాపాడాలనే ఆవేదన. అరుదైన నివేదన.

మమతా బెనర్జీ, ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) ప్రక్రియకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 4, 2026న సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించి చరిత్ర సృష్టించారు. ఒక ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో స్వయంగా వాదించడం ఇదే తొలిసారి. మమత న్యాయశాస్త్ర పట్టభద్రురాలు కావడంతో, ఆమె ‘పార్టీ ఇన్ పర్సన్’గా కోర్టు అనుమతి పొంది ఈ వాదనలు వినిపించారు.

2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను సమగ్రంగా సవరించేందుకు ‘సర్’ ను చేపట్టింది. ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది మంది అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుండి అక్రమంగా తొలగిస్తున్నారని ఆమె ఆరోపించారు. కేవలం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రమే లక్ష్యంగా ఈ సవరణలు చేస్తున్నారని, అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఇలా జరగడం లేదని ఆమె వాదించారు. వెంటనే ‘సర్’ ప్రక్రియను నిలిపివేసి, 2025 నాటి ఓటర్ల జాబితా ఆధారంగానే 2026 ఎన్నికలు నిర్వహించాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు.

ఢిల్లీ పాలకుల సూచనల మేరకు ఎన్నికల అధికారులు, బతికున్న వారిని కూడా చనిపోయినట్లుగా చూపి ఓటర్ల జాబితా నుండి వారి పేర్లు తొలగిస్తున్నారని మమత ధర్మాసనానికి వివరించారు. అలాగే ఎన్నికల అధికారులు ఆధార్ కార్డులను గుర్తింపు కార్డులుగా అంగీకరించడం లేదని, అదనపు పత్రాల కోసం ప్రజలను వేధిస్తున్నారని గళమెత్తారు.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే ఎన్నికల సంఘం ఇలా వేధింపులకు పాల్పడుతూ, పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ‘సర్’ ను “వాట్సాప్ కమిషన్” గా సంబోధించారు. ఈ సవరణ ప్రక్రియ తెచ్చిన విపరీతమైన ఒత్తిడి కారణంగా రాష్ట్రంలో 150 మంది ఓటర్లు, సిబ్బంది మరణించారని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మమతా బెనర్జీ వాదనలను విన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, దీనిపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తగిన సంఖ్యలో గ్రేడ్-2 అధికారులను ఎన్నికల విధులకు కేటాయించాలని, తద్వారా మైక్రో-అబ్సర్వర్ల అవసరం ఉండదని కోర్టు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను 9 ఫిబ్రవరి, 2026కు వాయిదా వేసింది.

ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని ఆందోళన చెందుతున్న వేళ, మమతా బెనర్జీ వేసిన ఈ అడుగు ఒక బలమైన ఆశావాదాన్ని చిగురింపజేసింది. ఒక సీఎం సామాన్య న్యాయవాదిగా వాదించడం రాజకీయ పోరాటం కాదు. న్యాయవ్యవస్థపై ఉన్న అచంచల విశ్వాసానికి ప్రతీక. పదవులు శాశ్వతం కాదని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కే ప్రజాస్వామ్యంలో పరమావధి అని ఈ ఘటన చాటిచెప్పింది.

భవిష్యత్తులో పాలకులు వ్యవస్థల పట్ల బాధ్యతగా ఎలా ఉండాలో, హక్కుల కోసం ఎలా తెగించి పోరాడాలో నేర్పే పాఠం, గుణపాఠం ఈ ‘దీదీ’ సాహసం.


-గోపాల బాలరాజు, సీనియర్ జర్నలిస్టు
73370 82570

Latest News

గీ పటికెతోటి గిన్ని లాభాలా?!|ADUGU TRENDS

పటికే కదాని గదాన్ని పక్కన పడేయకుండ్రి. పటికెతో ఎన్ని లాభాలో తెలిస్తే, గదాన్ని ఒదిలిపెట్టరు. పటికె సహజ సిద్ధమైన ఖనిజ లవణం. గదాంట్లె పొటాషియం, అల్యూమినియం సల్ఫేట్ ఉంటది. గదాన్ని నీల్లల్ల అటు...

పరిహాసంగా పార్లమెంట్ సమావేశాలు!|EDITORIAL

పార్లమెంట్ సమావేశాలు ప్రజాస్వామ్య పద్ధతికి అద్దంలాంటివి. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు సమస్యలపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించే అత్యున్నత వేదిక. కానీ ఇటీవలి కాలంలో, పార్లమెంట్ ఆ లక్ష్యానికి పూర్తిగా దూరమవుతోంది. సభా...

గురువారం ఫిబ్రవరి 05–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు మాఘమాసం--కృష్ణపక్షం సంకటహర చతుర్థి తిధి బ.చవితి రాత్రి 01.51 వరకు ఉపరి పంచమి నక్షత్రం ఉత్తర రాత్రి 12.39 వరకు ఉపరి హస్త యోగం సుకర్మ రాత్రి 01.56 వరకు ఉపరి ధృతి కరణం బవ పగలు 01.47...

శెపాతీ పొంగాల్నంటే, గిట్ల కాల్వాలె!|ADUGU TRENDS

రోగాలెక్కువైనయి కాబట్టి ఆరోగ్యం మీద ధ్యాసెక్కువైంది. బియ్యమన్నం తింటే, బీపీ, షుగర్లొత్తానయని, ఇగిప్పుడంతా శెపాతీలు తినబడ్తిరి. మరి గా శెపాతీలు బుస్సున పొంగి, కమ్మగుండాల్నంటే ఏం శేయాల్నో తెలుసా? ఇగో గా శెపాతీల్ని కాల్సెటప్పడు......

ఏపీలో ‘కల్తీ’ ఆజ్యం’!|EDITORIAL

సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంలో పడింది. లడ్డూ తయారీలో ఉపయోగించే ‘నెయ్యి కల్తీ’ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తీవ్ర ఉద్రిక్తతల్లోకి నెట్టింది. పవిత్ర ఆలయ...

బుధవారం ఫిబ్రవరి 04–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు మాఘమాసం--కృష్ణపక్షం తిధి బ.తదియ రాత్రి 01.41 వరకు ఉపరి చవితి నక్షత్రం పుబ్బ రాత్రి 11.56 వరకు ఉపరి ఉత్తర యోగం అతిగండ రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి పగలు 01.50...

ఇరుక్కుపోయిన పైపు తీసే ఇకమతు!|ADUGU TRENDS

ఉపాయం ఉంటే ఊరేగొచ్చు. ఇకమతుతోటి ఎంతటి కట్టమైన పనినైనా అల్కగ శేయేయొచ్చు. గసొంటిదే గీ ఇకమతుపాయం. ఒక ఇనుప పైపుల, ప్లాస్టిక్ పైపు మరలతోటి ఇరుక్కుపోయిందనుకోండ్లి! ఎట్ల తీస్తం? ఇగో, ఒక తాళం చెవిని...

సామాన్యుడి ఊసే లేని సంస్కరణల బడ్జెట్!?|EDITORIAL

దేశ ప్రజల ఆకలి బాధలు, జీవన ప్రమాణాల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలను పట్టించుకోకుండానే కేంద్ర ప్రభుత్వం మరోసారి బడ్జెట్‌ను యథావిధిగా ప్రవేశపెట్టింది. రూ. 53.47 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ కాగితాల...

మంగళవారం ఫిబ్రవరి 03–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు మాఘమాసం--కృష్ణపక్షం తిధి బ.విదియ రాత్రి 02.01 వరకు ఉపరి తదియ నక్షత్రం మఖ రాత్రి 11.03 వరకు ఉపరి పుబ్బ యోగం శోభ రాత్రి తెల్ల 04.26 వరకు ఉపరి అతిగండ కరణం తైతుల మధ్యాహ్నం 02.26...

సోమవారం ఫిబ్రవరి 02–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు మాఘమాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి రాత్రి 02.50 వరకు ఉపరి విదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.56 వరకు ఉపరి మఖ యోగం ఆయుష్మాన్ ఉదయం 08.24 వరకు ఉపరి సౌభాగ్య కరణం బాలవ మధ్యాహ్నం 03.29 వరకు ఉపరి...

Mostbet Free Spins Zamanı: Hər Hansı Oyunu Dəyişmək Mümkündür?

Mostbet Free Spins Zamanı: Hər Hansı Oyunu Dəyişmək Mümkündür?Mostbet pul qazana biləcəyiniz bir platformadır və burada pulsuz fırlanmalar (free spins) ilə bağlı şansınızı sınaya...

పెట్రోల్, థర్మాకోల్ తో బంక?!|ADUGU TRENDS

ఎన్కటికి బంక కావాల్నంటే, శెట్టు శేమలు తిరిగీ, తిరిగి తుమ్మ శెట్టు, యేప చెట్లకు ఏరుకుని వచ్చేది. గదాన్ని నీల్లల్ల నానబెడితే బంకయ్యేది. ఇగ గిప్పుడైతే గా శెట్లకు ఎవలు పోతాండ్లు? దుకాన్లకు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News