జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను నిశ్శబ్దంగా ఉండలేనని, రైతుల కోసం తెగించి మాట్లాడతానని స్పష్టం చేశారు. “నేను బయటికి వచ్చి ఈ విషయం చెబుతున్నా. ఇప్పుడు ఆ పెద్దవాళ్లు నన్ను చంపేస్తారా, లేక రైతులకు న్యాయం చేస్తారా అనేది చూడాలి” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి