ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కుప్పంను 100 శాతం సోలార్ పవర్ ఆధారితంగా మార్చే ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే, ప్రకృతి వ్యవసాయంపై పైలెట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన ద్వారా కుప్పంలో గ్రీన్ ఎనర్జీ, వ్యవసాయం అభివృద్ధికి మేజర్ మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు.

