ఇక వందల, వేల ఎకరాలు కొల్లగొట్టిన కబ్జాకోరుల భరతం పట్టనున్న ప్రభుత్వం
డిసెంబర్ 31తో ముగియనున్న టెర్రాసిస్ గడువు
ఎన్ ఐ సి ద్వారా నిర్వహణ
ధరణిపై ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు సర్కార్ నిర్ణయం
దీంతో రెవెన్యూ అధికారుల గుండెల్లో గుబులు
అర్థరాత్రి వేళ ఎవరు లాగిన్ అయ్యారు?
ఏ సర్వర్ నుండి ఏ ఐపీ అడ్రస్ ద్వారా లావాదేవీలు చేసేవారు?
ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుండి తొలగించారు?
ఫోరెన్సిక్ ఆడిట్‌లో ధరణి లావాదేవీల హిస్టరీ
రూ.2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యినట్టు ప్రభుత్వ లెక్కలు
గత కొన్నేళ్లుగా చెలామణి లో ఉన్న ధరణి పోర్టల్‌కు కాలం చెల్లింది. జనవరి 1వ తేదీ నుంచి ధరణి స్థానంలో భూ భారతి సేవలు అందు బాటులోకి రానున్నాయి. డిసెంబర్ 31తో టెర్రాసిస్ గడువు ముగియనుంది. దీంతో జనవరి ఒకటి నుంచి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్-NIC- ద్వారా భూ భారతి పోర్టల్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రానుంది. ఇదే సమయంలో సర్కార్ ధరణిపై ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో రెవెన్యూ అధికారుల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. రాత్రికి రాత్రే వందల ఎకరాలు కొల్లగొట్టిన వాళ్ల పై కేసులు నమోదు కానున్నాయి. అర్థరాత్రి వేళలో కూడా ఎవరు లాగిన్ అయ్యారు? ఏ సర్వర్ నుండి ఏ ఐపీ అడ్రస్ ద్వారా లావాదేవీలు చేశారు? ఏ సర్వే నెంబర్లను నిషేధిత జాబితా నుండి తొలగించారు? వంటి వివరాలను, ఫోరెన్సిక్ ఆడిట్‌లో మొత్తం ధరణి లావాదేవీల హిస్టరీని వెలికితీసేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. ధరణి ద్వారా రూ.2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
ఇప్పటివరకు ధరణి వివరాలు టెర్రాసిస్ ఏజెన్సీ నిర్వహించేది. ఆ సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌కు ట్రాన్సిట్ చేయ నుంది, టెర్రాసిస్ ఏజెన్సీ. దీంతో ధరణి మాటున భూముల కొల్లగొట్టినవారిని వెలికి తీసే పనిలో నిమగ్నం కానుంది ప్రభుత్వం.
ధరణి మాటున వేలాది ఎకరాల భూములను కొల్లగొట్టిన పెద్దల భరతం పట్టనుంది రేవంత్ సర్కార్. పోర్టల్ నిర్వహణ మారడంతో ధరణిపై ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు సర్కార్ రెడీ అయ్యింది. దీంతో రెవెన్యూ శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. రాత్రికి రాత్రే వందల ఎకరాలు కొల్లగొట్టిన కబ్జా కోరుల పని పట్టనుంది ప్రభుత్వం.
అర్థరాత్రి వేళ ఎవరు లాగిన్ అయ్యారు? ఏ సర్వర్ నుండి ఏ ఐపీ అడ్రస్ లావాదేవీలు చేసేవారు? ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుండి తొలగిం చారు? అనే అంశాలపై ఫోకస్ చేయనుంది. ఫోరెన్సిక్ ఆడిట్‌లో ధరణి లావాదేవీలు ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా కీలక విషయాలు వెల్లడి కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పటికే సుమారు 2 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యినట్టు ఇటీవల డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. నిషేధిత జాబితా భూములు రాత్రికి రాత్రే ఓ పెద్ద మనిషి సమక్షంలో డీల్ జరిగిందంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
ఒక్క హైదరాబాద్ పరిధిలో సుమారు 15వేల ఎకరాలు హాం ఫట్ అయినట్టు ప్రభుత్వ వర్గాల ప్రాథమిక అంచనా. ప్రభుత్వం 2014 నుండి రికార్డులు పరిశీలించి, ధరణి పోర్టల్ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయిస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత విచారణకు కమిటీ వేసి దోషులను తేల్చే ప్రక్రియను వేగవంతం చేయనుంది. దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రతో పాటు రెవెన్యూ కీలక అధికారుల గుట్టు రట్టు కానుంది.