రాష్ట్రంలో ఒక ఎకరం లోపు భూమి కలిగిన 17.03 లక్షల మంది రైతులకు ఇవాళ్టి నుండి రైతు భరోసా నగదు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వర్షాభావం, ఇతర సవాళ్లను ఎదుర్కొనేందుకు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరిన్ని సహాయ కార్యక్రమాలు అమలు చేస్తామని వెల్లడించారు.

