కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసిన ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్
ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ED కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఆస్తులను జప్తు చేయడాన్ని నిరసిస్తూ.. ఏర్పాటు చేసిన మహా ధర్నాలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ చెప్పినప్పటి నుంచి కేంద్రం కక్ష రాజకీయాలు మొదలుపెట్టిందని ఆమె ఆరోపించారు. అప్పటి నుంచి ప్రధాని మోడీ ప్రభుత్వం ఈడీ నోటీసులు, విచారణల ద్వారా రాజకీయ నాయకులను వేధింపులకు గురిచేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన వాతావరణం నెలకొంది. భవిష్యత్తు తరాలకు మంచి జరుగుతుందో లేదో అనే అనిశ్చితి ప్రజల్లో ఉంది. కుంభమేళాలో కుల వివక్ష చూపించారని, హిందూ రాష్ట్రంలో పేదవాళ్లను చెత్త పోయే ప్రాంతాల్లో ఉంచుతున్నారని, ఆ సమయంలో వారిని హిందువులుగానూ గుర్తించడం లేదన్నారు.
కేంద్రాన్ని ప్రశ్నిస్తే ఈడీ కేసుల పేరుతో వేధింపులు మితిమీరిపోతున్నాయని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ వంటి నాన్ ప్రాఫిట్ సంస్థలపై మని లాండరింగ్ ఆరోపణలు బిల్లకావన్నారు. సంస్థ బైలాస్ ప్రకారమే లావాదేవీలు జరగకుండా చర్యలు తీసుకున్నప్పటికీ, దానిపై విచారణలు సాగడమంటే కక్ష రాజకీయాలే అన్నారు. ఇందిరా గాంధీ కాలంలో కూడా ఇలాంటి పరిస్థుతులు ఎదురయ్యాయని, అప్పట్లో ఆమె పోరాడినట్లే ఇప్పుడు తమ వంతు పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం అందరికి అందాలంటే కొత్త నినాదంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, రాహుల్ గాంధీని ప్రధాని చేసేవరకు తమ పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు.

