ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో దిగిన తాజా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. భార్య స్నేహా రెడ్డి, కొడుకు అయాన్, కూతురు అర్హ తో కలిసి వైట్ టీషర్టుల్లో అందంగా కెమెరాలకు పోజులిచ్చారు. ‘పుష్ప – 2’ కోసం ప్రత్యేక లుక్‌లో కనిపించిన అల్లు అర్జున్, ఇటీవల తన హైర్ మరియు బియర్డ్ స్టైల్‌ను మార్చి కొత్త లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అలాగే, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చే అల్లు అర్జున్ కొత్త సినిమా మార్చి నుంచి ప్రారంభం కానుంది. ఈ కాంబినేషన్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

