ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మాజీ మంత్రి జానారెడ్డితో భేటీ అయ్యారు. జానారెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో నిర్వహించిన ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వేం నరేందర్ రెడ్డిలు కూడా హాజరయ్యారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సమావేశం ఇంకా కొనసాగుతోంది.