ఢీల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.11.28 కోట్ల విలువ చేసే 11.28 కేజీల విదేశీ గంజాయి ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఫుడ్ ప్యాకెట్స్ ముసుగులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అనే సమాచారంతో ఓ లేడి కిలాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిను ఫుడ్ ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసి లేడి కిలాడి తరలించే యత్నం చేయగా, కస్టమ్స్ అధికారుల స్క్రీనింగ్‌లో విదేశీ గంజాయి గుట్టు రట్టు అయింది. లగేజ్ బ్యాగ్‌లో దాచిన గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.