తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. ఎన్నికలకు సంబంధించి నిన్న మూడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్, రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, పోలింగ్ కేంద్రాల ఫైనల్ వంటి కీలక పనులకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఫ్రీ సింబల్స్ ప్రకటన..
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్ను ప్రకటిస్తూ.. జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల సింబల్స్ తో పాటుగా మరో 30 ఫ్రీ సింబల్స్ను కేటాయించింది. ఈ ఇండిపెండెంట్గా పోటీ చేసే వారు ఈ గుర్తుల్లో వేటినైనా ఎంపిక చేసుకోవచ్చు. వారికి ఈ గుర్తులను కేటాయిస్తారు. ఒకే గుర్తును ఇద్దరు ఎంపిక చేసుకుంటే డ్రా విధానంలో ఎంపిక చేసి వారికి కేటాయిస్తారు. నాలుగు జాతీయ పార్టీలు ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్కు చేయి గుర్తు, బీజేపీకి కమలం పువ్వు, ఆమ్ ఆద్మీ కి చీపురు, సీపీఎంకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు, గుర్తింపు పొందిన కేటగిరిలో ఎంఐఎంకు పతంగి, బీఆర్ఎస్కు కారు, టీడీపీకి సైకిల్, వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తులు కేటాయించారు. రిజిష్ట్రర్డ్ పార్టీల గుర్తుల్లో జనసేకు గాజు గ్లాసు, సీపీఐకి కంకి కొడవలి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్పార్టీ కి సింహం గుర్తులు ఉన్నాయి. రాష్ట్రంలో రిజిష్ట్రర్డ్ పార్టీలుగా నమోదు సింబల్కేటాయించని పార్టీలు 66 ఉన్నాయి.
ఫ్రీ సింబల్స్ ఇవే…
*ఎయిర్ కండిషనర్, ఆపిల్, పండ్ల బుట్ట, బెల్ట్, బైనాక్యులర్స్, కెమెరా, క్యారమ్, చపాతీ రోలర్, కోటు, ఫుట్ బాల్ ఆటగాడు ఇలా మొత్తం 30 సింబల్స్ను ఫ్రీ సింబల్స్ ఎన్నికల సంఘం ప్రకటించింది.
15 వరకు ఆర్వోలకు శిక్షణ
ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని ఈనెల 10వ తేదీ కల్లా ఖరారు చేయాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వీరికి శిక్షణ ఇచ్చేందుకు టీవోటీ(ట్రైనర్ఆఫ్లైనీస్) ల, మాస్టర్ ట్రైనీస్లకు శిక్షణ పూర్తి చేసింది. వీరిలో జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇస్తారు. ఆ తరువాత అసిస్టెంట్అటర్నింగ్ఎధికారులకు శిక్షణ ఇస్తారు. ఈనెల 12వ తేదీల్లో రిటర్నింగ్ఎధికారులకు, ఈనెల 15 కల్లా పీవోలు, ఏపీవోలకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
15 వరకు పోలింగ్ కేంద్రాలు ఫైనల్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఈనెల 15కల్లా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించాలని జిల్లా కలెక్టర్ లను ఆదేశించింది. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల ఖరారుకు షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేసింది. పోలింగ్ ప్రతిపాదిక పోలింగ్ కేంద్రాల జాబితాను స్వయంగా మండల స్థాయి అధికారులు పరిశీలించి ఆ భవనాలు ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉంటాయో లేదో పరిశీలించాలని సూచించింది. ఈ తరువాత ముసాయిదా జాబితాను ప్రకటించాలని సూచించింది.