ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హొత్రా సంతకంతో రూ.100, రూ.200 కరెన్సీ నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రకటించింది. మహాత్మ గాంధీ సిరీస్ తోనే కొత్త నోట్లు ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినా పాతనోట్లు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. గతంలో రిజర్వ్ బ్యాంక్ కొత్త రూ.500 నోట్లను జారీ చేసింది. పాత రూ. 1000 నోటను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
త్వరలో రూ.50 నోట్ల కూడా..
కొత్త రూ.50 నోటు ను విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ గతంలో ప్రకటించింది. ఈ కొత్త నోట్ల పై గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం కూడా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. కొత్త సిరీస్ లోని మహాత్మ గాంధీ చిత్రం కూడా ఈ నోట్ల పై ముద్రించబడుతుంది. ఈ నోటు పై కొత్త భద్రతా లక్షణాలను ఏర్పాటు చేస్తారు. తద్వారా నోటును కాపీ చేయడం కష్టమవుతుంది. దేశంలో పెరుగుతున్న నకిలీ నోట్ల వ్యాప్తిని ఆపవచ్చు.