ఎమ్మెల్యే కి వినతి పత్రం అందజేసిన గూడూరు లెనిన్
ప్రభుత్వానికి ప్రజలకు వారది గా పని చేస్తున్న పాలకుర్తి ప్రెస్ క్లబ్ (రి.నెం259/2024)
కు స్థలం కేటాయించడంతోపాటు శాత్వత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆ క్లబ్ అధ్యక్షులు గూడూరు లెనిన్
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.
సోమవారం నియోజకవర్గ కేంద్రంలోని వారి క్యాంపు కార్యాలయంలో వారిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందచేశారు. ఎమ్మెల్యే అందుకు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ప్రెస్ క్లబ్ కార్యదర్శి చెరిపెల్లి అశోక్ మహర్షి, తోడేటి ఆంజనేయులు, వాసు, కోతి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

