తమిళనాడులోని ఓ పానీపూరీ వ్యాపారికి భారీ GST నోటీసులు రావడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. FY24లో వ్యాపారికి రూ.40 లక్షల ఆన్లైన్ పేమెంట్లు వచ్చాయని గుర్తించిన పన్ను శాఖ, పన్ను చెల్లించాలని ఆదేశించినట్టు సమాచారం. అలాగే FY22, FY23లో కూడా ఇలాంటి లావాదేవీలను పరిశీలించినట్టు తెలుస్తోంది. కస్టమర్లు UPI, రేజర్ పే వంటి పేమెంట్ మాధ్యమాలు ఉపయోగించడంతో ఈ విషయం వెలుగు చూసింది. కార్పొరేట్ ఉద్యోగులకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఈ వ్యాపారి పన్ను చెల్లించడం సమంజసమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.