సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లు వేసిన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు పై ఈ రోజు విచారణ జరగనుంది. తమ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ… బిఆర్ఎస్ పిటిషన్ వేయగా, విచారణ చేసి కనీసం ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించింది. నోటీసుల జారీ తరువాత ఈ రోజు కేసు విషయంలో సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.