అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై సుంకాలు విధించినప్పటికీ, దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. “సుంకాల గురించి ఎలాంటి ఆందోళనా లేదు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. ప్రత్యక్ష ప్రభావం ఉంటుందా అన్నది ఇప్పుడే చెప్పలేం, కానీ పరోక్షంగా కొన్ని మార్పులు రావొచ్చు. అయితే, మా ప్రధాన లక్ష్యం ఆత్మనిర్భర భారత్ అని” ఆమె పేర్కొన్నారు.

