శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు-మాఘమాసం-కృష్ణపక్షం
తిధి బ నవమి ఉదయం 09.40 వరకు
ఉపరి దశమి
నక్షత్రం జ్యేష్ఠ పగలు 02.30 వరకు ఉపరి
మూల
యోగం హర్షణ ఉదయం 09.10 వరకు
ఉపరి వజ్ర
కరణం గరజి ఉదయం 08.33 వరకు
ఉపరి భద్ర
వర్జ్యం రాత్రి 10.53 నుండి 12.39
వరకు
దుర్ముహూర్తం ఉదయం 06.40 నుండి
08.15 వరకు
రాహుకాలం ఉదయం 09.00 నుండి
10.30 వరకు
సూర్యోదయం ఉదయం 06.40
సూర్యాస్తమయం సాయంత్రం 06.05
ఫిబ్రవరి 22 శనివారం 2025
రాశి ఫలితాలు
మేష
ఉద్యోగంలో అనుకోని శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
వృషభ
ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనపరంగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. అనారోగ్య సూచనలున్నాయి, జాగ్రత్త అవసరం.
మిథున
ఆదాయం పెరుగుతుంది, అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా ఉంటుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి.
కర్కాటక
అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది.
సింహ
ఉద్యోగ జీవితం సాదాసీదాగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మెరుగైన కార్యకలాపాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి, ఆచితూచి ఖర్చు చేయండి.
కన్య
ఆదాయం వృద్ధి చెందుతుంది, ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
తుల
గ్రహ అనుకూలత వల్ల ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాల్లో పాల్గొంటారు.
వృశ్చిక
ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
ధనుస్సు
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
మకర
రోజంతా సుఖ సంతోషాలతో గడుపుతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల్లో పాల్గొంటారు.
కుంభ
వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
మీన
వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. ఉద్యోగాల్లో అధికారులు ప్రోత్సహిస్తారు. కుటుంబంలో సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.